జనవరి తొలివారం నుంచి పెరగనున్న చలి తీవ్రత

హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రంలో చలి తీవ్రత తక్కువగా ఉన్నదని జనవరి తొలివారం నుంచి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ దిశ నుంచి రాష్ర్టానికి వీస్తున్న తేమగాలులతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయంది. ఈ తేమగాలుల కారణంగా ఉత్తర తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. నిజామాబాద్‌, రామగుండంలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు, నల్లగొండ, మెదక్‌లో అతి తక్కువగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదేవిధంగా హైదరాబాద్‌లో సాధారణం కన్నా 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వెల్లడించింది.