ఆరు కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సుమారు 12వేల కోట్లు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసి రికార్డు సృష్టించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్‌లో జరుగుతున్న గ్లోబల్ పొటాటో కాన్‌క్లేవ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. కొన్ని రకాల ఆహార ధాన్యాలు, ఉత్పత్తుల తయారీలో భారత్ టాప్ త్రీ దేశాల్లో నిలిచిందని మోదీ అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదన్నారు. రైతులు, కేంద్రం చేపట్టిన చర్యల వల్లే ఆహార ఉత్పత్తుల్లో భారత్ అగ్ర స్థానానికి చేరుకున్నట్లు ప్రధాని చెప్పారు.