శ్రీరామ్ ఆదిత్య చిత్రంలో జగపతిబాబు..

టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. నవంబర్ లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నారు. సెకండ్ షెడ్యూల్ లో అశోక్, జగపతి బాబు షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో నరేశ్, సత్య, అర్చన సౌందర్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.